Home » Pinnelli Ramakrishna Reddy
ఏపీలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మాచర్ల రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో వారిని అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది.
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను కిందకేసి పగులగొట్టిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని, అతని అనుచరులను ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్త గుర్తున్నారా..? ఆయన హఠాన్మరణం..
టీడీపీ నేతల హత్యకు సంబంధించిన కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. హత్య రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొంటూ, వారి పేర్లు తప్పుగా చేర్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Macherla case: గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు.
అల్లర్లు సృష్టించడానికే జగన్ విజయవాడకు వెళ్లారని టీడీపీ నేత బుద్దా వెంకన్నా ఆరోపించారు. పిన్నెలి రామకృష్ణ రెడ్డి, వంశీని కలిసిన జగన్ దళితుడైన నందిగామ సురేష్‌ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్‌లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.
మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల అండతో అరాచకాలు, దోపిడీలకు పాల్పడిన మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తుర కా కిశోర్‌కు మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.