Budda Venkanna: పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టుపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.. బుద్దా వెంకన్న ఫైర్
ABN , Publish Date - Dec 14 , 2025 | 02:42 PM
ఏపీలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు.
విజయవాడ, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Budda Venkanna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ కోసం వేలం పాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ధ్వజమెత్తారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్ రెడ్డి.. ఇలా రాక్షసులు అంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేస్తే... ఇది తప్పు, అన్యాయం అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇవాళ(ఆదివారం) విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బుద్దా వెంకన్న.
పిన్నెల్లి బ్రదర్స్‌ను పరామర్శించాలా..?
ఏపీలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు. పవన్ కల్యాణ్ సామాజికవర్గంపైనా దుర్మార్గాలకు తెగబడ్డారని ఆరోపించారు. తమ మీద దాడులు చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని గుర్తుచేశారు. జై వైసీపీ అనలేదని పీక కోసి చంపేశారని ఫైర్ అయ్యారు. చనిపోవడానికి సిద్ధమైన చంద్రయ్య... జై టీడీపీ అని ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు. అది తమ బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ మీద ఉన్న కమిట్‌మెంట్ అని చెప్పుకొచ్చారు. పిన్నెల్లి బ్రదర్స్ దుర్మార్గాలను కట్టడి చేయాలని పోలీసులు అరెస్టు చేస్తే... కొవ్వొత్తుల ప్రదర్శన ఎందుకు..?. జగన్ అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ నేతలకు జగన్ ఆదేశాలు ఇస్తారని.. జైలుకు వెళ్లి పిన్నెల్లి బ్రదర్స్‌ను పరామర్శించాలంట ఎందుకు..? అని నిలదీశారు బుద్దా వెంకన్న.
జగన్ ... నైజం ఏమిటో అర్థం చేసుకోవాలి..
పిన్నెల్లి బ్రదర్స్‌ను వెనుకేసుకు వస్తున్న జగన్ ... నైజం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇద్దరు వ్యక్తులను అత్యంత కిరాతకంగా చంపిన వారిని అరెస్టు చేస్తే.. దుర్మార్గులకు జగన్ సంఘీభావం ప్రకటించారు. ఏపీలో జగన్ నాయకత్వాన్ని బలపరచడం అంటే.. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్లే. బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులకు ప్రజలు లొంగిపోయి.. మీ పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయొద్దని కోరుతున్నాను. వైసీపీ నేతల సమావేశాలు, యాత్రలకు కూడా డబ్బులు ఇస్తున్నారని వెళ్లకండి. ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ఏపీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారు. మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఈ రాష్ట్రం బాగు కోసం నిత్యం కృషి చేస్తున్నారు. రుషులు యాగం చేస్తుంటే.. రాక్షసులు నాశనం చేసినట్లుగా,... చంద్రబాబు రాష్ట్రాన్ని బాగుచేస్తుంటే.. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని అడ్డంకులు కలిగిస్తున్నారు. జగన్ ప్రెస్‌మీట్‌లు చూడండి.. నా ప్రెస్‌మీట్‌లు చూడండి.. మాట్లాడే తీరు, చేసిన వ్యాఖ్యలు పరిశీలించండి. జగన్‌కు మతి భ్రమించింది.. అసలు మాజీ సీఎంగా ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు పట్టడం లేదు. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ లేకపోతే.. అక్కడి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినట్లే’ అని వ్యాఖ్యానించారు బుద్దా వెంకన్న.
రౌడీలకు సంఘీభావం తెలుపుతున్నావా జగన్..?
‘పల్నాడు జిల్లాలో పిన్నెల్లి బ్రదర్స్‌తో ఎవరికీ మనశాంతి లేదు.. అలాంటి రౌడీలకు సంఘీభావం తెలుపుతున్నావా జగన్..?. మీ అరాచకాలు భరించలేక వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు.. ఈసారి 1 సీటే మీకు దిక్కు. మా జిల్లాలో కొడాలి నాని, పేర్ని నానీలు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకరికి గుండె కాయ లేదు.. మరొకరికి ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి. ఇలాంటి వారు జగన్ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. వీరు ఆరు నెలలకు కోలుకుని.. జగన్ పక్కన చేరే లోపు జగన్ పరిస్థితి ఏమిటో ఆలోచన చేయండి. మళ్లీ జగన్ సీఎం కావడం కల. ఇప్పుడు ఉన్నది ప్రజా క్షేమం కోరే కూటమి ప్రభుత్వం... మీ పగటి కలలు మానండి. ఇప్పుడు బయటకు వచ్చి మంగమ్మ శపథాలు చేస్తే మీ మాటలు ఎవరూ విశ్వసించరు. ఏపీలో జగన్ పాలన పోయిన తర్వాత ప్రజలు దీపావళి చేసుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డికి 11 పోయి 1 సీటు మిగలడం ఖాయం. పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లు, దుర్మార్గులను ప్రజలు తరిమి కొట్టాలి. అటువంటి వారిని కాపాడుతున్న జగన్‌ను, వైసీపీని అడ్రస్ లేకుండా చేయాలి’ అని హెచ్చరించారు బుద్దా వెంకన్న.
ఈ వార్తలు కూడా చదవండి..
పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల
విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్
Read Latest AP News And Telugu News