AP Police Notices On Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్.. ఎందుకంటే..
ABN , Publish Date - Oct 08 , 2025 | 08:54 AM
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మాచర్ల రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
పల్నాడు జిల్లా, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (Pinnelli Venkatrami Reddy)లకు మాచర్ల రూరల్ పోలీసులు (Macherla Rural Police) మరోసారి నోటీసులు జారీ చేశారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేశారు.
పిన్నెల్లి సోదరులు ఇవాళ(బుధవారం) విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు మాచర్ల రూరల్ పోలీసులు. ఇప్పటికే ఓసారి విచారణ చేశారు మాచర్ల రూరల్ పోలీసులు. అయితే, జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ రోజు(బుధవారం)తో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ముగియనుంది. ఇవాళ పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ క్రమంలో పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
Read Latest AP News And Telugu News