Share News

Pinnelli Brothers: మరోసారి పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు

ABN , Publish Date - Jan 19 , 2026 | 09:44 PM

పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులను పల్నాడు జిల్లా పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు.

Pinnelli Brothers: మరోసారి పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు
Pinnelli Brothers

పల్నాడు జిల్లా, జనవరి19 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులను (Pinnelli Brothers) పల్నాడు జిల్లా పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలను (Pinnelli Venkata Ramireddy) మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మాచర్ల న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మాచర్ల న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం..ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులను అప్పగించనున్నారు. జంట హత్యల కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు ఈ కస్టడీ అవసరమని పోలీసులు కోర్టును కోరగా, న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది.


నెల్లూరు జిల్లా జైల్లో విచారణ

ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను అక్కడే విచారించేందుకు మాచర్ల రూరల్ పోలీసులు సిద్ధమవుతున్నారు. కస్టడీ కాలంలో హత్యల వెనుక ఉన్న కుట్ర, ఇతర నిందితుల పాత్ర ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు పల్నాడు జిల్లా పోలీసులు తెలిపారు.


మరిన్ని అంశాలు వెలుగులోకి...

గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యలు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇప్పుడు పిన్నెల్లి సోదరులను విచారించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 10:05 PM