Share News

AP Police: మద్యం మత్తులో పోలీసులపై ఎదురుదాడి.. మందుబాబుల అరెస్ట్

ABN , Publish Date - Jan 19 , 2026 | 08:28 PM

మచిలీపట్నంలో మద్యం మత్తులో కొంతమంది యువకులు పోలీసులపై ఎదురుదాడికి దిగిన ఘటన కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన ముగ్గురు మందుబాబులను ఆర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AP Police: మద్యం మత్తులో పోలీసులపై ఎదురుదాడి.. మందుబాబుల అరెస్ట్
AP Police

కృష్ణా జిల్లా, జనవరి19 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో (Machilipatnam) మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు పోలీసులపై ఎదురుదాడికి దిగిన ఘటన కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన ముగ్గురు మందుబాబులను ఆర్‌పేట పోలీసులు (RPeta Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నంలోని బలరామునిపేట జగ్జీవన్ రామ్ నగర్ ప్రాంతంలో కొంతమంది యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.


చట్టాన్ని అతిక్రమించి...

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై మద్యం మత్తులో ఉన్న యువకులు తిరగబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులను ఆర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టాన్ని అతిక్రమించి, పోలీసుల విధి నిర్వహణకు అడ్డుపడినందుకు వారిపై కేసులు నమోదు చేశారు.


ప్రజల సమక్షంలో కౌన్సెలింగ్

ఈ ఘటనలో ఎదురుదాడి జరిగిన ప్రాంతంలోనే, ప్రజలందరి సమక్షంలో నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం మత్తులో చేసే చర్యల వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను పోలీసులు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆర్‌పేట సీఐ ఏసుబాబు పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు పరిరక్షించగలమని, చట్టాన్ని గౌరవించాలని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 08:59 PM