Supreme Court on Pinnelli Brothers Case Investigation: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట..
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:22 PM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో వారిని అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది.
అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి(Pinnelli Venkatarami Reddy)కి సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట దక్కింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో (Telugu Desam Party Leaders Case) వారిని అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే, గతంలో టీడీపీ నేతలు వేంకటేశ్వరావు, కోటేశ్వరావు హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు నిరాకరించింది.
ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు పిన్నెల్లి సోదరులు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(గురువారం) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. తదుపరి విచారణను మూడు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది. అంతవరకూ వారిని అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి.. పవన్ ప్రశంసలు
Read Latest Andhra Pradesh News and National News