ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Parthasarathi: ఇప్పుడైనా పశ్చాత్తాపపడండి

ABN, Publish Date - May 04 , 2025 | 05:38 AM

అమరావతి ప్రజలే తమ రాజధానిగా సాధించుకున్నారని, వైసీపీ చేసిన ప్రతిబంధకాలు విఫలమయ్యాయని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు దూరదృష్టిని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని ఆయన తెలిపారు

  • ప్రజలే రాజధాని సాధించుకున్నారు: మంత్రి పార్థసారథి

విజయవాడ, మే 3(ఆంధ్రజ్యోతి): ‘స్వార్థపరులు, అప్రజాస్వామిక వాదులు ఇప్పుడైనా పశ్చాత్తాప పడితే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలీదు కానీ... కనీసం భగవంతుడైనా క్షమించడానికి ప్రయత్నం చేస్తాడు’ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘అమరావతి నిర్మాణాన్ని వైసీపీ నాయకులు అడ్డుకోవాలని చూసినా ప్రజలే తమ రాజధానిని సాధించుకున్నారు. రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఎదుగుతుందనే నమ్మకం ప్రధాని మోదీ వ్యాఖ్యలతో కలిగింది. చంద్రబాబు పనితనం, దూరదృష్టి ప్రతిపక్షానికి తెలియకపోవడం దురదృష్టం. దేవతల రాజధానిగా అమరావతిని ప్రధాన మంత్రి గుర్తించడం గర్వంగా ఉంది. కానీవైసీపీ నాయకులు భ్రమరావతి లాంటి పేర్లు పెట్టి విషాన్ని కక్కారు. తుచ్ఛ రాజకీయ నాయకులకు అందని రీతిలో చంద్రబాబు ఆలోచనలు ఉంటాయి’ అని కొనియాడారు.

Updated Date - May 04 , 2025 | 05:38 AM