Yogandhra: యోగాంధ్రకు 1.13 కోట్ల మంది రిజిస్ట్రేషన్
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:25 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జూన్ 21 నాటికి 2 కోట్ల మంది భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టగా, ఇప్పటికే 1.13 కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రారంభించిన యోగాంధ్ర ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో 2కోట్ల మందిని భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా శుక్రవారం నాటికే కోటి మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి 2 కోట్లకు పైగా లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధ్రలో రెండు కోట్ల రిజిస్ట్రేషన్ల లక్ష్యంలో శుక్రవారం రాత్రికి 1.13 కోట్ల మంది స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని యోగాంధ్ర నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు మంత్రుల కమిటీకి నివేదించారు. మాస్టర్ ట్రైనర్ల నమోదు 408 శాతం కాగా, శిక్షకుల నమోదు 113 శాతం మేర జరిగిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 04:25 AM