Minister Anam: 1,015 ఆలయ కమిటీల నియామకానికి నోటిఫికేషన్
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:44 AM
రాష్ట్రంలోని 1,015 ఆలయాలకు కమిటీలు నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని, త్వరలోనే నియమకాలు పూర్తి చేస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
గోదావరి, కృష్ణా పుష్కరాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు: ఆనం
విజయవాడ (ఇంద్రకీలాద్రి), జూన్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 1,015 ఆలయాలకు కమిటీలు నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని, త్వరలోనే నియమకాలు పూర్తి చేస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సోమవారం దుర్గగుడి మాస్టర్ ప్లాన్ అమలుపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్‌చంద్, కమిషనర్ కె.రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో వీకే శీనానయక్‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియమించిన కమిటీలను తాము బలవంతంగా రాజీనామా చేయించటం లేదని, స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాటికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వంలో నియమించిన కమిటీల కాలపరిమితి ముగిసిన వెంటనే వాటికి కూడా నోటీఫికేషన్ విడుదల చేస్తామన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు
Updated Date - Jun 24 , 2025 | 03:44 AM