Nimmala RamaNaidu: జగన్ చేసిన పాపం.. రాష్ట్రానికి శాపం
ABN, Publish Date - Feb 02 , 2025 | 08:41 PM
Nimmala RamaNaidu: వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై నాటి సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయాడు మండిపడ్డారు. నాడు జగన్ చేసిన పాపం... నేడు రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 02: డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, స్టీల్ ప్లాంట్, జల జీవన్ మిషన్ పొడిగింపు తదితర ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని పేజ్-1, పేజ్-2 లు లేవని.. కానీ 2019 అనంతరం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకు రావడం ద్వారా తీవ్రమైన తప్పిదం చేశారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో 41.15 మీటర్లు.. 45.72 మీటర్లు అంటూ రెండు పేజ్‌లను కేంద్రానికి పంపి వైస్ జగన్ చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎం చంద్రబాబు హయంలో 18 నెలల పాటు శ్రమించి పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేసిన జగన్.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పిదాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరిదిద్దుతున్నారని తెలిపారు.
Also Read: వసంత పంచమి.. ఇలా చేయండి చాలు
రూ. 990 కోట్లతో సీఎం చంద్రబాబు డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ప్రారంభించి.. 2025, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తున్నారని వివరించారు. పోలవరం నిర్వాసితులకు నాడు 2017లో రూ. 830 కోట్లు.. మళ్లీ 2024లో రూ. 1000 కోట్లు ఇచ్చి న్యాయం చేసింది సీఎం చంద్రబాబు నాయుడేనని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు.
Also Read: బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నా
2019 -24 మధ్య పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఒక్క రూపాయి సైతం సాయం లేదని వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. పునరావాస కాలనీలకు ఒక్క అర బస్తా సిమెంట్ పని చేయకుండా జగన్ దగా చేశాడని మండిపడ్డారు. గత ప్రభుత్వ విధ్వంసం నుంచి.. మళ్లీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పోలవరం పునర్నిర్మాణం జరిగి 2027 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Also Read: బాలీవుడ్ నటులపై కేసు
Also Read: మావోయిస్టుల కుట్ర.. భగ్నం చేసిన భద్రతా దళాలు
For Andhrapradesh News And Telugu News
Updated Date - Feb 02 , 2025 | 08:41 PM