NHRC: కుప్పం ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:25 AM
చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలోని నారాయణపురం గ్రామంలో భర్త చేసిన అప్పునకు భార్యని చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది.
నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు నోటీసులు
న్యూఢిల్లీ, జూన్ 20(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలోని నారాయణపురం గ్రామంలో భర్త చేసిన అప్పునకు భార్యని చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటాగా తీసుకుంది. ఆ మహిళను వడ్డీ వ్యాపారి మునికన్నప్ప చెట్టుకు కట్టినట్లు ఈనెల 16న మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలు నిజమైతే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించవలసి ఉంటుందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.
Updated Date - Jun 21 , 2025 | 06:41 AM