Abandoned Vehicle: ఎవరిదీ చెత్త పాపం
ABN, Publish Date - Jun 18 , 2025 | 04:35 AM
పదుల సంఖ్యలో మినీ ట్రాక్టర్లు, హైడ్రాలిక్ ట్రక్కులు, బ్యాటరీ ఆటోరిక్షాలు... ఒకే చోట పోగేసి కనిపిస్తున్నాయి కదూ! పనికిరాని, తుక్కుగా మారిన వాహనాలను ‘డంపింగ్’ చేసినట్లు అనిపిస్తోంది కదూ! కానే కాదు!
పదుల సంఖ్యలో మినీ ట్రాక్టర్లు, హైడ్రాలిక్ ట్రక్కులు, బ్యాటరీ ఆటోరిక్షాలు... ఒకే చోట పోగేసి కనిపిస్తున్నాయి కదూ! పనికిరాని, తుక్కుగా మారిన వాహనాలను ‘డంపింగ్’ చేసినట్లు అనిపిస్తోంది కదూ! కానే కాదు! ఇవన్నీ... ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాలు! ఒక్కసారంటే ఒక్కసారీ వాడకుండానే ఇలా ఎండకు ఎండీ, వానకు తడిసీ... తుక్కైపోతున్నాయి. బుజబుజ నెల్లూరులో నాలుగైదేళ్లుగా ఇలాగే పడిఉన్నాయి. ఈ వాహనాలను వైసీపీ హయాంలో ‘స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్’ ద్వారా కొనుగోలు చేశారు. చెత్త సేకరణ కోసం వాటిని పంచాయతీలకు అందించాలి. కానీ... అలాగే వదిలేశారు. ఆటోలు దాదాపుగా తుక్కుగా మారాయి. కొన్ని వాహనాల్లోని బ్యాటరీలు చోరీ అయ్యాయి. తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన వాహనాలన్నింటినీ గ్రామాలకు పంపిణీ చేసేశామని పంచాయతీ విభాగం అధికారులు చెబుతున్నారు. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులేమో అవి తమవి కావని అంటున్నారు. మరి... ఇన్ని వాహనాలు ఎవరివి? ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?
- నెల్లూరు, ఆంధ్రజ్యోతి
Updated Date - Jun 18 , 2025 | 04:37 AM