Minister Nara Lokesh : బ్యాగ్ బరువు తగ్గిద్దాం
ABN, Publish Date - Jan 08 , 2025 | 03:57 AM
పాఠశాల స్థాయి లో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గాలని మానవ వనరు ల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
కొన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకం.. ప్రాథమిక స్థాయిలో అన్నింటికీ ఒక్కటే
మరింత నాణ్యతతో పాఠ్యప్రణాళిక.. ఓఎంఆర్ స్థానంలో డిజిటల్ అసె్‌సమెంట్
సీబీఎ్‌సఈ తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానం అమలుపై అధ్యయనం
ఉన్నత విద్యలో 50% జీఈఆర్ లక్ష్యం.. మార్చికి వీసీల నియామకం: లోకేశ్
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పాఠశాల స్థాయి లో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బరువు తగ్గించి, నాణ్యత పెరిగేలా నూతన పాఠ్య ప్రణాళిక రూ పొందించాలని ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖలపై మంగళవారం సమీక్ష నిర్వహించా రు. ‘ఏపీ మోడల్ ఎడ్యుకేషన్’ లక్ష్యంగా సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాల విద్యలో ఓఎంఆర్ షీట్ ల స్థానంలో డిజిటల్ అసె్‌సమెంట్ చేస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని చెప్పారు. జీవో 117కు ప్రత్యామ్నాయం విషయంలో ఎమ్మెల్యేలు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల అభిప్రాయాలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు రెండు సెమిస్టర్లకు వేర్వేరుగా పుస్తకాలు ఇస్తున్నారు. ఇకపై ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా పుస్తకం అక్కర్లేకుండా, కొన్ని సబ్జెక్టుల ను కలిపి ఒకే పుస్తకంగా తీసుకొచ్చే విధానాన్ని అధికారులు వివరించారు. ప్రాథమిక స్థాయిలో మొత్తం సబ్జెక్టులు ఒకే పుస్తకంలో ఉండాలని, పైతరగతుల్లో ప్రస్తుతం ఉన్న పుస్తకాలను సగానికి తగ్గించి, రెండు, మూడు సబ్జెక్టులు ఒకే పుస్తకంలోకి తేవాలనే ప్రతిపాదనలు చేశారు. దీనిని మరోసారి పరిశీలించి, నిర్ణయించాలని మంత్రి ఆదేశించారు. విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా డీఎస్సీ పూర్తిచేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్ విద్యలో గత పదేళ్లుగా ఎలాంటి సంస్కరణలు తీసుకురాలేదన్నారు.
ప్రీఫైనల్ పరీక్షలు జనవరి నాటికి పూర్తిచేసేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. సంస్కరణలు ప్రవేశపెట్టే ముందు విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రుల సలహాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గణితంలో ఒకే పేపర్, బోటనీ, జువాలజీ కలిపి ఒకే పేపర్ నిర్వహించడంపైనా చర్చించారు. సీబీఎ్‌సఈ తరహాలో ఇం టర్నల్ మార్కుల విధానం అమలుపై అధ్యయనం చేయాలని లోకేశ్ సూచించారు. యూనివర్సిటీల వీసీలు, సలహా మండలి సభ్యుల నియామకాలు మార్చి నాటికి పూర్తికావాలన్నారు. ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్)ను 36 శాతం నుంచి 50 శాతానికి పెంచేలా చర్యలుండాలని ఆదేశించారు.
Updated Date - Jan 08 , 2025 | 04:01 AM