RD Trust Services: ఆర్డీటీకి లోకేశ్ ఊతం
ABN, Publish Date - Jun 07 , 2025 | 04:24 AM
రాయలసీమతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలందిస్తున్న రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు మంత్రి లోకేశ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
సేవల కొనసాగింపుపై కేంద్రంతో సంప్రదింపులు
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): రాయలసీమతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలందిస్తున్న రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు మంత్రి లోకేశ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్డీటీ సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగాన్ని ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎ్‌ఫసీఆర్‌ఏ) కింద కేంద్రం నిలిపేయడంతో ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఖాతాల్లో ఉన్న నిధులను సంస్థ వినియోగించడానికి వీలు లేకుండా పోయింది. దీంతో లోకల్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో ఉన్న నిధులనే సేవా కార్యక్రమాలకు వాడాల్సి వస్తోంది. ఫలితంగా సంస్థ నిర్వహిస్తున్న విద్య, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాలు, పాఠశాలల నిర్వహణ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
Updated Date - Jun 07 , 2025 | 04:26 AM