ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Vijayasai Reddy: పాలిటిక్స్‌కు విజయసాయి రెడ్డి గుడ్‌బై.. ఫ్యూచర్ ప్లాన్ ఇదేనా

ABN, Publish Date - Jan 24 , 2025 | 07:13 PM

MP Vijayasai Reddy Quit Politics: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. ఈ నెల 25వ తేదీన రాజ్యసభ్య సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.

MP Vijayasai Reddy

వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 25వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక మీదట ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. వేరే పదవులు, ఇతర ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదని.. ఇది తన పర్సనల్ డెసిషన్ అని తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఎవరూ ప్రభావితం చేయలేదన్నారు విజయసాయి. నాలుగు దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ ఫ్యామిలీకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. విజయసాయి ప్రకటనతో ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.


భవిష్యత్ అదే..

ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని విజయసాయి స్పష్టం చేయడంతో ఆయన తదుపరి అడుగులు ఎటువైపు అనే చర్చలు మొదలయ్యాయి. అయితే దీని మీదా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన భవిష్యత్తు వ్యవసాయమని స్పష్టం చేశారు. ఎంపీగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చిత్తశుద్ధితో శక్తవంచన లేకుండా కృషి చేశానని ట్విట్టర్‌లో పోస్ట్‌లో చేసిన ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పని చేశానన్నారు. తొమ్మిదేళ్ల పాటు కొండంత బలాన్ని ఇచ్చి, గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజయసాయి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. టీడీపీతో పొలిటికల్‌గా విభేదించానని తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని.. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ట్వీట్ చేశారు విజయసాయి.


ఇవీ చదవండి:

ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మ్యూజిక్ నైట్

తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు

గ్రీన్ ఎనర్జీతో ఏపీలో భారీగా పెట్టుబడులు

మరిన్ని ఏపీ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 07:16 PM