ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP Appalanaidu: రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి కార్యక్రమాలు.. జగన్‌పై ఎంపీ ఫైర్

ABN, Publish Date - Jun 01 , 2025 | 06:48 PM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌లో ఇంకా సైకో బుద్దులు పోలేదని విమర్శించారు.

Jagan And Appalanaidu

విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌లో ఇంకా సైకో బుద్దులు పోలేదని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు దినంను వెన్నుపోటు దినంగా ప్రకటించడం లోనే అతని వ్యక్తిత్వం తెలుస్తుందన్నారు. జగన్ పరిపాలన నుండి విముక్తి పొందేందుకు ప్రజలు జూన్ 4న ఓట్లతో తీర్పు ఇచ్చారని, అదే రోజును జగన్ రెడ్డి పాలన నుంచి విముక్తి దినంగా ప్రకటిస్తున్నామన్నారు. ప్రజా తీర్పు అంటే వైసీపీకి గౌరవం లేదని మండిపడ్డారు.


ప్రజల సాకారం, కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తుంటే.. జగన్ చూస్తూ ఓర్వలేకే వెన్నుపోటు లాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. తల్లి, చెల్లి , ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో నువ్వు వెన్ను పోటు పొడవలేదా? జగన్‌ అంటూ ప్రశ్నించారు. నిన్ను నమ్ముకున్న విజయసాయిరెడ్డిని పార్టీ నుండి తీసేశావ్, మహానాడు జరపకూడదని కలెక్టర్‌కు రెప్రజెంటేన్ ఇచ్చావు.. మీ పార్టీ కార్యకలాపాలను మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా? అంటూ నిలదీశారు. వైసీపీ నాశనం చేసిన వ్యవస్థలను చంద్రబాబు తన అనుభవంతో సరిచేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.


Also Read:

సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన విజయనగరం ఎమ్మార్వో కుటుంబం

ఇక పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

For More Telugu News

Updated Date - Jun 01 , 2025 | 06:49 PM