Minister Narayana : టిడ్కో సముదాయాల్లో ఆలయాల నిర్మాణం
ABN, Publish Date - Feb 10 , 2025 | 05:46 AM
గృహసముదాయాల్లో సీతారాముల ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ తెలిపారు.
ఆత్మకూరులో శ్రీకారం, హాజరైన మంత్రులు
ఆత్మకూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 67 టిడ్కో గృహసముదాయాల్లో సీతారాముల ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ తెలిపారు. వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆదివారం సుమారు రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. ఆత్మకూరు టిడ్కో గృహ సముదాయం వద్ద ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సవిత, ఫరూక్, బీసీ జనార్దన్, ఎంపీ వేమిరెడ్డి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, చంద్రబాబు అపార అనుభవంతో మళ్లీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.
Updated Date - Feb 10 , 2025 | 05:46 AM