ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Parthasarathi: పారిశ్రామికవేత్తలను భయపెట్టడానికే వైసీపీ దుష్ప్రచారం

ABN, Publish Date - Jul 30 , 2025 | 05:47 AM

పారిశ్రామికవేత్తలను భయపెట్టడానికే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు..

  • నా కుటుంబం అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పరిశ్రమనే నెలకొల్పాం

  • జగన్‌ పత్రిక కథనంపై మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు, జూలై 29(ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవేత్తలను భయపెట్టడానికే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధికి వైసీపీ అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. మంగళవారం బెంగళూరు నుంచి ఆయన ఫోన్‌లో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను వైసీపీ గందరగోళపరుస్తోంది. మా కుటుంబం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద నిర్మించనున్నది కంప్రెస్డ్‌ గ్యాస్‌ ఉత్పత్తి పరిశ్రమ. ఇది పూర్తి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. వాహనాలు, పరిశ్రమలు గ్యాస్‌ను వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను మరింత విస్తృతపరచడానికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ పరిశ్రమ ఏర్పాటులో నా పదవిని దుర్వినియోగపరచలేదు. ఈ పరిశ్రమకు కావల్సిన ప్రధాన వనరైన టన్ను నేపియర్‌ గడ్డి కోసం 40 ఎకరాల భూమి అవసరం. అంటే సుమారు 800 ఎకరాలు అవసరం. ఈ భూమికి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున కౌలు చెల్లింపు చేస్తారు. ప్రతి ఏటా పది శాతం పెంపుదల ఉంటుంది. సదరు భూమి ప్రభుత్వ వేస్ట్‌ ల్యాండ్‌ నుంచి గాని లేదా రైతుల దగ్గర నుంచి గాని తీసుకోకపోతే ఈ పరిశ్రమ నడపడం సాధ్యంకాదు. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలే. నా మీద వ్యతిరేకత ఉన్న కొంతమంది రాజకీయవేత్తలు చేస్తున్న ప్రచారాలలో వాస్తవాలను తెలుసుకోకుండా, నిబంధనలు అమలు జరిగాయా లేదా అనేది పరిశీలించకుండా జగన్‌ పత్రిక ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదు’ అని మంత్రి పార్థసారథి అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 05:47 AM