AP Education: ముఖ్యమైన జీవోలు అర్ధరాత్రా
ABN, Publish Date - Jun 13 , 2025 | 04:21 AM
పాఠశాల విద్యాశాఖలో ముఖ్యమైన జీవోలు అర్ధరాత్రి సమయాల్లో జారీ కావడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన మెగా డీఎస్సీ జీవో అర్ధరాత్రి విడుదలైంది.
సీఎం చెప్పినా ‘తల్లికి వందనం’ జీవో ఆలస్యం
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖలో ముఖ్యమైన జీవోలు అర్ధరాత్రి సమయాల్లో జారీ కావడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన మెగా డీఎస్సీ జీవో అర్ధరాత్రి విడుదలైంది. కీలకమైన టీచర్ల బదిలీ జీవో కూడా అదే సమయంలో విడుదల చేశారు. ఇక తల్లికి వందనం పథకంపై బుధవారం జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే పాఠశాల విద్యాశాఖ అధికారులు గురువారం ఉదయం విడుదల చేశారు. జీవో విడుదలైన తర్వాత హడావిడిగా సచివాలయాలకు అర్హులు, అనర్హుల జాబితాలు పంపారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం వరకూ సమాచారం చేరలేదు. ఇలా ముఖ్యమైన జీవోలు ఆలస్యంగా విడుదల చేయడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం ఏర్పడుతోంది.
Updated Date - Jun 13 , 2025 | 04:23 AM