ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dola Balaveeranjaneya Swamy: పేదింటి బిడ్డలకు ఎంబీబీఎస్‌ సీట్లు

ABN, Publish Date - Jun 16 , 2025 | 04:50 AM

నీట్‌లో అర్హత సాధించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మం త్రి డోలా బాలవీరాంజనేయస్వామి అభినందించారు. మొత్తం 143 మంది అర్హత సాధించగా..

  • గురుకుల విద్యార్థులకు మంత్రి డోలా అభినందన

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): నీట్‌లో అర్హత సాధించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మం త్రి డోలా బాలవీరాంజనేయస్వామి అభినందించారు. మొత్తం 143 మంది అర్హత సాధించగా.. వారిలో 32 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు దక్కే అవకాశముందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రశంసించారు. పేదింటి బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు స్వప్నమన్నారు. గురుకులాల్లో జేఈఈ, నీట్‌ కోచింగ్‌ సెంటర్లను ఈ ఏడాది 3 నుంచి 10కి పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. నాడు జగన్‌ నాన్నకు ఇంధనం పేరుతో నకిలీ మద్యంతో పేదల నుంచి రూ.వేల కోట్లు దోపిడీ చేస్తే.. నేడు చంద్రబాబు ‘తల్లికి వందనం’తో పేద విద్యార్థులకు రూ.10 వేల కోట్లు ఇచ్చారని అన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 04:52 AM