Medar ST Inclusion: మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి
ABN, Publish Date - Apr 10 , 2025 | 04:51 AM
మేదర సంఘాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ మహేంద్ర(మేదర) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జొరిగే మస్తాన్‌రావు కోరారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన పేర్కొన్నారు
రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం
గుంటూరు, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మేదర సంఘీయులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆంధ్రప్రదేశ్ మహేంద్ర(మేదర) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జొరిగే మస్తాన్‌రావు కోరారు. గుంటూరులో బుధవారం ఏపీ మేదర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్ర అధ్యక్షుడుగా జొరిగె మస్తాన్‌రావు(వినుకొండ), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలేపల్లి నాగేంద్ర(అనంతపురం), కోశాధికారి శిరిగిరి మంగారావు(ఏలూరు), ప్రచార కార్యదర్శి పిల్లి మాణిక్యాలరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా టీ నారాయణమ్మను ఎన్నికయ్యారు.
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 10 , 2025 | 04:52 AM