ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: టెన్త్‌ పేపర్లు ఎత్తుకుపోయిన జగన్‌

ABN, Publish Date - Jun 01 , 2025 | 04:13 AM

పదో తరగతి మూల్యాంకనంపై జగన్‌ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌ హయాంలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారని, తానే దానిని గాడిలో పెడుతున్నానన్నారు.

విలువల గురించి మాట్లాడడమా?

మూల్యాంకనంలో వ్యత్యాసం 16.8ు

మీ హయాంలో 17-20 శాతం తేడాలు

జగన్‌కు మంత్రి లోకేశ్‌ కౌంటర్‌

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): చిన్నప్పుడే టెన్త్‌ పేపర్లు ఎత్తుకుపోయిన జగన్‌ నుంచి హుందాతనం ఆశించడం తప్పే అవుతుందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విద్యార్థుల యూనిఫాం నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు వేసుకుని, సొంత పేర్లు పెట్టుకున్న ఆయన ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. పదో తరగతి మూల్యాంకనంపై మాజీ సీఎం జగన్‌ శనివారం పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎక్స్‌ ద్వారా ఆయనకు లోకేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘జగన్‌ ప్రజా జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్‌ అయ్యారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలను రద్దుచేసిన మీరూ మాట్లాడుతున్నారా?. అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. మీరు తీసుకొచ్చిన జీవో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. టీచర్లను, విద్యార్థులను సన్నద్ధం చేయకుండానే సీబీఎ్‌సఈ తీసుకొచ్చారు. నేను మంత్రి కాగానే వారికి పరీక్ష నిర్వహించగా 90శాతం మంది ఫెయిల్‌ అయ్యారు. వారి భవిష్యత్తు కోసం సీబీఎ్‌సఈని వాయిదా వేశాం. ఐబీ తీసుకొచ్చినట్టు కలలు కంటున్నారు. వాస్తవానికి మీరు తీసుకొచ్చింది ఐబీ సిలబస్‌ కాదు. ఐబీ అమలుకు రిపోర్ట్‌ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారు అంతే. ఇక టోఫెల్‌ బోధించే టీచర్లు లేకపోయినా టోఫెల్‌ తెచ్చినట్లు జబ్బలు చరుచుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.4,500 కోట్లు, గుడ్లు, చిక్కీలకు రూ.వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిపోయారు. మీ హయాంలో టీచర్ల బదిలీలకు మంత్రి డబ్బులు వసూలు చేశారన్నది బహిరంగ రహస్యం. మీరు భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నా. రాజకీయాలకు అతీతంగా టీచర్ల బదిలీలు చేస్తు న్నాం.’’ అని పేర్కొన్నారు.


రీకౌంటింగ్‌ కొత్తది కాదు!

పదో తరగతి జవాబు పత్రాల రీకౌంటింగ్‌ అనేది కొత్త విధానం కాదని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ‘‘ఈ ఏడాది 45,96,527 జవాబుపత్రాలు మూల్యాంకనం చేశారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ తర్వాత 11,175 పేపర్లలో మాత్రమే వ్యత్యాసం వచ్చింది. ఇందులో మానవ తప్పిదం 0.25శాతం మాత్రమే. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నాం. అదే జగన్‌ హయాంలో 2022లో 20శాతం, 2023లో 18శాతం, 2024లో 17శాతం వ్యత్యాసాలు వచ్చాయి.’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 04:13 AM