ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Parental Appeal: మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టరూ

ABN, Publish Date - Jun 13 , 2025 | 05:16 AM

ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరుగుతున్న బిడ్డలిద్దరికీ కాలేయ వ్యాధి సోకింది. పెద్దదైన పాప నాలుగు రోజుల క్రితం మృతి చెందింది...బాబు పరిస్థితి విషమంగా ఉంది. లక్షల్లో ఖర్చు.. చేతిలో సొమ్ములేదు...

  • ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలకు కాలేయ వ్యాధి

  • బాలిక మృతి, బాలుడి పరిస్థితి విషమం

  • దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

ద్వారకాతిరుమల, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరుగుతున్న బిడ్డలిద్దరికీ కాలేయ వ్యాధి సోకింది. పెద్దదైన పాప నాలుగు రోజుల క్రితం మృతి చెందింది...బాబు పరిస్థితి విషమంగా ఉంది. లక్షల్లో ఖర్చు.. చేతిలో సొమ్ములేదు. రెక్కాడతే గానీ డొక్కాడని ఆ కుటుంబం దిక్కుతోచని స్థితి ఇది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సాయంపాలెం గ్రామానికి చెందిన బుద్దాల హరిబాబు, రాజేశ్వరి దంపతులకు మౌనిక(6), నాలుగేళ్ల జస్వంత్‌ శ్రీరామసాయి సంతానం. పిల్లలిద్దరూ కొద్ది రోజుల క్రితం జ్వరం, వాంతులు, విరోచనాలతో ఒక్కసారిగా నీరసించిపోయారు. జంగారెడ్డిగూడెంలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పాప మృతి చెందింది. బాబును రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించాలని, రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. వెంటనే బాలుడ్ని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు బుధవారం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రూ.10 లక్షలు మంజూరు చేయిస్తూ, ఎల్‌వోసీ ఇప్పించి హైదరాబాద్‌లోని ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. తల్లి రాజేశ్వరి తన లివర్‌ను ఇచ్చేందుకు సిద్ధపడటంతో గురువారం తెల్లవారు జామున తల్లి లివర్‌లో భాగాన్ని తీసి సాయికి అమర్చారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే బాలుడికి ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, చికిత్సకు చాలా ఖర్చు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు, మిగిలిన ఒక్కగానొక్క బిడ్డను ఎలా కాపాడుకోవాలోనంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. దాతలు ఆపన్నహస్తాన్ని అందించి తమ బిడ్డకు పునర్జన్మ నివ్వాలని వేడుకుంటున్నారు. దాతలు సాయం చేయాల్సిన బ్యాంకు ఖాతా నంబర్‌ 1567104000034733(పోతన ఆంజనేయులు), పోన్‌ పే : 79897 72877(పోతన పూర్ణ అనంతలక్ష్మి).

Updated Date - Jun 13 , 2025 | 05:19 AM