Leopard: తిరుమల మొదటి ఘాట్‌లో చిరుత కలకలం
ABN, Publish Date - May 27 , 2025 | 05:56 AM
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చిరుత పిట్టగోడపై కనిపించడంతో వాహనదారులు భయపడ్డారు. భద్రతా సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కలిసి పరిశీలించి, చిరుత అడవిలోకి వెళ్లిపోయినట్లు ధృవీకరించారు.
రోడ్డు పిట్టగోడపై పరుగులు
భయబ్రాంతులకు గురైన వాహనదారులు
తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటి ఘాట్‌లో సోమవారం రాత్రి చిరుత సంచారం కలకలం సృష్టించింది. తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్‌రోడ్డులోని వినాయక స్వామి ఆలయానికి సమీపంలో ఓ చిరుత రోడ్డుపక్కనే ఉన్న పిట్టగోడపై బైఠాయించింది. కార్లు శబ్ధం చేస్తూ వస్తున్న క్రమంలో చిరుత పిట్టగోడపై పరుగులు తీసింది. కొంతదూరం పరుగులు తీశాక లోయలోకి దూకింది. దీంతో చిరుతను చూసిన వాహనదారులు హడలిపోయారు. అలిపిరి చెక్‌పాయింట్‌లోని భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఫారెస్ట్ సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. అయినప్పటికీ తిరిగి వచ్చే అవకాశముందనే అంచనాతో భారీ శబ్ధాలు చేశారు. అలాగే ద్విచక్రవాహనదారులను అప్రమత్తం చేసి పంపారు. ఆదివారం రాత్రి అలిపిరి కాలినడకమార్గంలోని 350వ మెట్టు వద్ద కూడా ఓ చిరుత సంచరించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 05:56 AM