ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Leopard Death Probe: చిరుత మృతిపై విచారణ ప్రారంభం

ABN, Publish Date - Apr 19 , 2025 | 05:21 AM

అన్నమయ్య జిల్లా పొన్నేటిపాళెంలో చిరుత మృతి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వేటగాళ్లు ఉచ్చుపెట్టి బంధించారని పీసీసీఎఫ్‌ చలపతిరావు విచారణలో వెల్లడించారు

  • పొన్నేటిపాళెంలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పీసీసీఎఫ్‌

  • చిరుతను బంధించేందుకే ఉచ్చు: చలపతిరావు

మదనపల్లె టౌన్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాళెం గ్రామం వద్ద చిరు త మృతిని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుందని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చలపతిరావు పేర్కొన్నారు. శుక్రవారం చిరుత మృతిచెందిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. చిరుత తిరుగాడిన ప్రదేశం, చుట్టుపక్కల చిట్టడవి, నీటి కుంటల చుట్టూ అడవి జంతువుల పాదముద్రలను ఆయన పరిశీలించారు. వేటగాళ్ల ఉచ్చులో చిరుత ఎన్ని గంటలకు చిక్కుకుని ఉండవచ్చు, ఎంత సేపు బందీగా ఉండిపోయింది తదితర విషయాలను సబ్‌ డీఎ్‌ఫవోను అడిగి తెలుసుకున్నారు. అలాగే చిరుతను రక్షించడానికి తీసుకున్న చర్యలపై ఆరా తీశారు.


అనంతరం చలపతిరావు మీడియాతో మాట్లాడుతూ వేటగాళ్లు కావాలనే చిరుతను బంధించేందుకు పకడ్బందీగా జీఐ తీగలతో ఉచ్చులు బిగించారన్నారు. వన్యప్రాణుల వేటపై ప్రభుత్వం కఠినంగా వ్యహరిస్తుందని స్పష్టంచేశారు. అనంతరం మదనపల్లె అటవీశాఖ రేంజ ర్‌ కార్యాలయంలో పీసీసీఎఫ్‌ చలపతిరావు అంతర్గతంగా ప్రతిఅధికారిని విచారించారు. చిరుత చిక్కుకున్నప్పటి నుంచి ఏ చర్యలు తీసుకున్నా రు. ఏ సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు.. అని ఆరా తీశారు. పొన్నేటిపాళెంకు చెందిన ఆరుగురు రైతులనూ పీసీసీఎఫ్‌ విచారించారు.

Updated Date - Apr 19 , 2025 | 05:21 AM