ఘనంగా యోగా డే
ABN, Publish Date - May 29 , 2025 | 12:25 AM
‘యోగాంధ్ర’లో భాగంగా పట్టణంలోని అమ్మవారిశాల కల్యాణ మండపంలో ఆసనాలు వేశారు.
నందికొట్కూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘యోగాంధ్ర’లో భాగంగా పట్టణంలోని అమ్మవారిశాల కల్యాణ మండపంలో ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బేబి మాట్లాడుతూ జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగా ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలంత భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంపీడీవో, ఐసీడీఎస్ సిబ్బంది, మోప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లాలోని ఆదర్శ పాఠశాల ఆవరణలో బుధవారం ‘యోగాంధ్ర’ను నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో గోపికృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్, ఉప తహసీల్దార్ నాగన్న, వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ అధికారులు యోగాలో పాల్గొని ఆసనాలు చేశారు.
కొత్తపల్లి: మండల కేంద్రంలోని వెన్నెల గార్డెన్స్‌లో బుధవారం ఆయూష్ డాక్టర్ జమానుల్లా ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో మేరీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. డీటీ పెద్దన్న, ట్రైనర్లు అన్నమ్మ, శైలజ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మహానంది: మహానంది మండలంలోని వివిధ గ్రామాల అధికారులతో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసనాలను చేయించారు. తిమ్మాపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆవరణలో వివిధ మండల శాఖల అధికారుల చేత యోగసనాలు వేయించారు. ఎంపీడీవో మహమ్మద్ దౌలా మాట్లాడుతూ జూన్ 7వ తేదిన మహానందిలో కలెక్టర్ ఆధ్వర్యంలో భారీ స్ధాయిలో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా శిక్షకురాలు వెంకటలక్ష్మి, జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి, వైధ్యాధికారి భగవాన్‌దాస్, ఎంఈవో రామసుబ్బయ్య, ఎంపీహెచ్‌ఈవో హుసేన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కలువ భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 03:10 PM