ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నందీశ్వరుడికి పూజలు

ABN, Publish Date - Jun 24 , 2025 | 12:49 AM

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం లోక కల్యాణార్థం పంచమఠాలలో విశేష అభిషేకం, పుష్పార్చనలు చేశారు.

శ్రీశైలంలో పూజలు చేస్తున్న ఈవో

నంద్యాల కల్చరల్‌(శ్రీశైలం), జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం లోక కల్యాణార్థం పంచమఠాలలో విశేష అభిషేకం, పుష్పార్చనలు చేశారు. అనంతరం త్రయోదశి సంద ర్భంగా నందీశ్వరుడికి దేవస్థాన సేవగా విశేషపూజలు నిర్వహిం చారు. అనంతరం నందీశ్వర స్వామికి శాస్త్రో క్తంగా పంచామృతాలతో, ఫలోదకాలతో కుంకుమోదకం, గంఽధోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికా గుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. శ్రీశైలంలో నిత్యకళారాధనలో భాగంగా కడప జిల్లా నటరాజ డాన్స్‌ అకాడమీ వారితో సంప్రదాయ నృత్యప్రదర్శన ఏర్పాటు చేశారు. శివతాండవం, మూషికవాహన, శివశంకరా నమో, నమో: శివాయ, హర హర శంభో గీతాలకు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు.

మహానంది: మహానంది క్షేత్రంలో సోమవారం సాయంత్రం నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు, అభిషేకం నిర్వహించారు. వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మతో పాటు ప్రధాన అర్చకులు అర్జునశర్మ, అర్చకులు సుబ్బయ్యశర్మ వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలతో పంచామృతాలు, విశేష చూర్ణికలు, వట్టివేరు, కురువేరు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ఇన్‌చార్జి పర్యవేక్షకుడు పసుపుల సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:49 AM