ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: డీపీవో

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:39 AM

రాష్ట్రంలో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి సూచించారు.

డీపీవోకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సిబ్బంది

నంద్యాల రూరల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి సూచించారు. పట్టణలోని డీపీవో కార్యాలయంలో మంగళవారం ఆమె డీపీవోగా బాధ్యతలు స్వీకరించారు. సిబ్బందితో పరిచయ కార్యక్రమం అనంతరం డీపీవో మాట్లాడారు. గ్రామ పంచాయతీల పురోగాభివృద్ధికి, ఆర్థిక వనరుల సృష్టికి చక్కటి మార్గదర్శకం చేస్తామని అన్నారు. వర్షాకాలంలో పారిశుధ్య చర్చలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. తాగునీటి ట్యాంక్‌ల శుభ్రత, ప్రజారోగ్య సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు సిబ్బంది సూచనలు చేస్తామన్నారు. డీఎల్‌డీవో శివారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మహానందిలో పూజలు

మహానంది: మహానంది క్షేత్రంలో మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ముఖద్వారం వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి కలువ భాస్కర్‌ ఆధ్వర్యంలో అర్చకుడు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయాల్లో మహానందీశ్వరుడికి, కామేశ్వరీదేవి అమ్మవార్లకు అభిషేకార్చన పూజలు చేశారు. అనంతరం అలంకార మంటపంలో వీరిని వేదపండితులు ఆశీర్వదించారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లయ్య శాలువాతో సన్మానించి, స్వామి వారి మెమెంటో, ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఈవోఆర్డీ నాగేంద్రుడు ఉన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:39 AM