ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వక్ఫ్‌ సవరణను ఉపసంహరించుకోవాలి

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:51 AM

కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, అప్పటి దాకా పోరాటం సాగిస్తామని ఆత్మకూరు వక్ఫ్‌ పరిరక్షణ జేఏసీ నాయకులు ముఫ్తి నూర్‌మహ్మద్‌, మౌలానా రహంతుల్లా, మోలానా జబీవుల్లా, ముఫ్తి అల్తాఫ్‌ హుసేన్‌ తెలిపారు.

ఆత్మకూరులో ర్యాలీ చేస్తున్న ముస్లింలు

ఆత్మకూరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, అప్పటి దాకా పోరాటం సాగిస్తామని ఆత్మకూరు వక్ఫ్‌ పరిరక్షణ జేఏసీ నాయకులు ముఫ్తి నూర్‌మహ్మద్‌, మౌలానా రహంతుల్లా, మోలానా జబీవుల్లా, ముఫ్తి అల్తాఫ్‌ హుసేన్‌ తెలిపారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఆత్మకూరులోని కొత్తపేట పెద్ద మసీద్‌ నుంచి ముస్లింలు జాతీయ, నల్లజెండాలను చేతబూని నంద్యాల టర్నింగ్‌, కేజీరోడ్డు మీదుగా గౌడ్‌సెంటర్‌కు భారీ ర్యాలీగా చేరుకున్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా వక్ఫ్‌ సవరణ చట్టానికి ఇచ్చిన మద్దతును విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని అక్కడ డిప్యూటీ తహసీల్దార్‌ మనోహర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌, అర్బన్‌ సీఐ రాము నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టారు.

Updated Date - Apr 22 , 2025 | 12:52 AM