ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేతనాలు పెంచాలి

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:34 AM

మున్సిపల్‌ కార్మికులకు జీవో నెం36 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్‌నాయక్‌, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు నాగన్న, పెద్దనాగరాజు కోరారు.

ఆత్మకూరులో నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ఆత్మకూరు, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కార్మికులకు జీవో నెం36 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్‌నాయక్‌, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు నాగన్న, పెద్దనాగరాజు కోరారు. గురువారం ఆత్మకూరు పట్టణంలో ఇంజనీరింగ్‌, పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పాతబస్టాండ్‌ నుంచి కేజీరోడ్డు, తహసీల్దార్‌ కార్యాలయం మీదుగా మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి మున్సిపల్‌ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులకు పని తగ్గ వేతనం ఇవ్వాలని అన్నారు. అలాగే పెండింగ్‌ పీఎఫ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. లేనిపక్షంలో సమ్మె చేపట్టేందుకు సిద్ధమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు తిమ్మయ్య, ప్రసాద్‌, జోసఫ్‌, గొడుగురాజు, జయన్న, నాగన్న, రాజేంద్ర, సురేష్‌, హోసన్న, సువర్ణమ్మ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 01:35 AM