ఘనంగా వేళాంగిణి పండుగ
ABN, Publish Date - May 11 , 2025 | 12:20 AM
పట్టణంలో వెలసిన వేళాంగిణి మహోత్సవాలు ఆర్సీఎం విచారణ గురువు కేడీ జోసెఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి.
నందికొట్కూరులో ప్రార్థన చేస్తున్న బిషప్
నందికొట్కూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో వెలసిన వేళాంగిణి మహోత్సవాలు ఆర్సీఎం విచారణ గురువు కేడీ జోసెఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. ఈ మహోత్సవాలకు ముఖ్య అతిథిగా కడప బిషపు మహాగణ సగినాల పాల్ ప్రకాష్ హాజరయ్యారు. శనివారం సాయంత్రం నూతన బిషప్‌ను భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. బిషప్ దివ్య బలిపూజను సమర్పిస్తూ వాక్య పరిచర్య చేశారు. బిషప్ అయిన తర్వాత మొదటిసారిగా తాను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉదయం నుంచే ప్రజలు ప్రత్యేకంగా ప్రార్థన ల్లో పాల్గొన్నారు. గురువులు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 12:20 AM