హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:42 AM
సూపర్ సిక్స్ హామీల అమల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు.
ఆత్మకూరు, జూలై 11(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ హామీల అమల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు. పట్టణ శివార్లలోని సిద్దేపల్లి రస్తాలో గల ఎల్‌వీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ‘బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ’ అంశంపై నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల పేరుతో లేనిపోని హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నేడు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అరకొర హామీలను అమలు చేస్తూ అన్ని చేశామని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మోసపూరిత హమీలతో సీఎం చంద్రబాబు చేసిన మోసాలను వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటని ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, కచ్చితంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అదేక్రమంలో రెడ్‌బుక్ సంస్కృతిని విడనాడాలని, ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదని అన్నారు. అనంతరం బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అంశంపై రూపొందించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, మోమిన్ అహ్మద్ హుసేన్, సయ్యద్‌మీర్, విజయ్‌చౌదరి, మారుబోతుల విజయ్, మోమిన్ మునీర్‌బాషా, సుల్తాన్, అంబాల ప్రభాకరరెడ్డి, లాలం రమేష్, మహేశ్వర రెడ్డి, తిరుపమరెడ్డి, యూనూస్, జయరాజు తదితరులు ఉన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 12:42 AM