ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాలకు మహర్దశ: ఎమ్మెల్యే

ABN, Publish Date - Apr 17 , 2025 | 01:04 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ చేకూరిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

వెంకటాపురంలో రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

ఆత్మకూరు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ చేకూరిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలంలోని కరివేనలో రూ.2.25కోట్లు, నల్లకాల్వలో రూ.20లక్షలు, వెంకటాపురంలో రూ.45.5లక్షలు, వడ్లరామాపురంలో రూ.35లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని అన్నారు. హామీలన్నీ తప్పక అమలు చేసి తీరుతామన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఎంపీడీవో సుబ్రమణ్యం, పంచాయతీ రాజ్‌ ఏఈ సుబ్బయ్య, ఎంపీపీ తిరుపాలమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు కర్నాటి శ్రీరాములు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మహానందిగంగాదేవీ, వెంకటరమణ, మాణిక్యమ్మ, నాయ కులు రాజారెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఎలీషా, రమేష్‌, గోవర్దన్‌రెడ్డి, కొండలరావు, రవినాయక్‌, దినకర్‌, శరత్‌, శేషన్న, చిన్న, లింగస్వామి ఉన్నారు.

కరివేనలో వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే బుడ్డా

ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో బుధవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు, హౌసింగ్‌, ఇళ్లస్థలాలకు సంబంధించి లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రతివారం ప్రతిష్టాత్మ కంగా ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.

Updated Date - Apr 17 , 2025 | 01:04 AM