ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:03 AM

కేంద్ర ప్రభుత్వ పథకాలపై చెంచులు అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి వెంకట శివప్రసాద్‌ సూ చించారు.

ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేస్తున్న ఐటీడీఏ పీవో

ఆత్మకూరురూరల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాలపై చెంచులు అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి వెంకట శివప్రసాద్‌ సూ చించారు. మండలంలోని బైర్లూటి గూడెంలో బుధవారం ఏర్పాటు చేసిన గిరిజనుల సమావేశంలో అధికారులతో కలిసి ఆయన పాల్గొని మా ట్లాడారు. గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం ధర్తిఆభాభగిదరి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా 17 మంత్రిత్వ శాఖలను అనుసంధానిస్తూ గిరిజన గూడేలలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోం దన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజనులకు పక్కా ఇళ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌, పక్కా రహదారుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. అలాగే ఆధార్‌ కార్డులు లేని గిరిజనులకు ఆధార్‌ కార్డులు మంజూరు చేసి, ఆయుష్మాన్‌ కార్డుల ద్వారా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్‌ కార్డులులేని వారికి రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం చెంచులకు మంజూరు చేసిన ఆయుష్మాన్‌ కార్డులు, రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహసీల్దార్‌ మనోహర్‌, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:03 AM