ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సహకారం

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:35 AM

గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు నాబార్డు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నంద్యాల జిల్లా నాబార్డు ఏజీఎం కార్తీక్‌ తెలిపారు.

అల్లూరులో మాట్లాడుతున్న నాబార్డు ఏజీఎం కార్తీక్‌

నందికొట్కూరు రూరల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు నాబార్డు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నంద్యాల జిల్లా నాబార్డు ఏజీఎం కార్తీక్‌ తెలిపారు. మండలంలోని అల్లూరు గ్రామంలో మంగళవారం రైతులు ఏర్పాటు చేసిన అవని రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని(ఎ్‌ఫపీఓ) పరిశీలించారు. రైతులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. అనంతరం ఆయన రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజీఎం మాట్లాడుతూ రైతులు సంఘటితంగా ఇన్‌పుట్ అలాగే అవుట్‌పుట్‌ వ్యాపారాలు హోల్‌ సేల్‌గా నిర్వహించుకోవాలని సూచించారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, అనిమల్‌ హస్బెండరీ అన్ని ప్రభుత్వ డిపార్టుమెంట్‌ స్కీములను అందుబాటులోకి వచ్చేలా సంఘం బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, సీఈవోలు కృషి చేయాలని సూచించారు. ఎఫ్‌పీవో అభివృద్ధి కోసం నాబార్డు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని రైతులకు తెలిపారు. ఇదే సందర్భంలో పీఏసీఎస్‌ సెక్రటరీ అశోక్‌ మాటా ్లడుతూ త్వరలో రైతులకు ఎరువులు, పురుగు మందులు అందుబాటు లోకి తెస్తున్నామన్నారు. కార్యక్రంలో ఎఫ్‌పీవో డైరెక్టర్‌ బి. జయమ్మ, లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణ, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:41 AM