ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి

ABN, Publish Date - May 09 , 2025 | 01:23 AM

వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్‌వీ రాజు సూచించారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న క్రీడాభివృద్ధి అధికారి

ఆత్మకూరు, మే 8(ఆంధ్రజ్యోతి): వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్‌వీ రాజు సూచించారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని కేవీకే స్టేడియం నందు నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థులు, పిల్లలు సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడలపై మక్కువ చూపాలన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి క్రీడాకారులకు అవసరమైన సహకారాన్ని అందించి ప్రోత్సహించడం సంతోషకర మన్నారు. అనంతరం శిక్షకులకు, క్రీడాకారులను పరిచయం చేసుకు న్నారు. ఆత్మకూరు స్పోర్ట్స్‌ క్లబ్‌ చైర్మన్‌ పస్పీల్‌ మున్నా, శిక్షకులు ఖాజాహుసేన్‌, నరేష్‌, ఉపేంద్ర, సతీష్‌, హరి, మహెబూబ్‌, తైక్వాండో, ఖోఖో క్రీడల అసోషియేషన్‌ అధ్యక్షులు సయ్యద్‌, బాబు ఉన్నారు.

Updated Date - May 09 , 2025 | 01:23 AM