ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:11 AM

నియోజకవర్గ ప్రణాళికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, సీఎస్‌వో

నియోజకవర్గ ప్రణాళికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, సీఎస్‌వో

పాణ్యం, జూలై 3(ఆంధ్రజ్యోతి): cపాణ్యంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురవారం ఏర్పాటు చేసిన విజన్‌ 2047 ప్రణాళిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా నియోజకవర్గంలో చేపట్టా ల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఓర్వకల్లులోని పరిశ్రమలతో ఆ మండలంలోని గ్రామాల అభివృద్ధి మరింత పుంజుకుంటుందన్నారు. అలాగే పరిశ్రమల ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాల తయారీ కేంద్రాలను పాణ్యంలో ఏర్పాటు చేయడం వల్ల పాణ్యంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే పిన్నాపురంలోని సోలార్‌ ప్రాజెక్టుతో మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికలో ముఖ్యంగా వ్యవసాయ, పరిశ్రమలు, సేవా కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 2047 నాటికి దేశంలో రాష్ట్రం అన్ని అంశాలలో ముందుండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు. పీ4 (పబ్లిక్‌, ప్రైవేట్‌, పిపుల్స్‌ పార్టిసిపేషన్‌) ద్వారా నిరుద్యోగ యువతకు చేయూతనిస్తుం దన్నారు. జడ్పీ సీఎస్‌వో సుబ్బారెడ్డి, కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల ఎంపీడీవోలు జీఎన్‌ఎస్‌ రెడ్డి, శ్రీనివాసులు, ప్రవీణ్‌కుమార్‌, వాసుదేవగుప్తా, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:11 AM