ప్రజలకు అందుబాటులో ఉండాలి
ABN, Publish Date - May 10 , 2025 | 01:12 AM
అధికారులు ప్రజలకు అందు బాటులో ఉండాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు.
మిడుతూరు, మే 9 (ఆంధ్రజ్యోతి): అధికారులు ప్రజలకు అందు బాటులో ఉండాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు. మిడుతూరు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయతీ సమస్యలను అధి కారులు త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిం చారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 40 శాతం సబ్సిడీ, 50 శాతం సబ్సిడీ కింద వచ్చిన వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే వ్యవసాయాధికారి పీరు నాయక్ ఆధ్వర్యంలో రైతులకు అందజేశారు.
మహిళలకు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, నాయకులు గుండం సర్వోత్తమరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సధాకర్ రెడ్డి, రమణ రెడ్డి, బాషా, నరసింహగౌడు, నాగేంద్రుడు, చాకర్‌వలి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 10 , 2025 | 01:12 AM