ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:46 AM

జగజ్జననీ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడమాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించుకుంటారు.

అమ్మవారికి పుట్టింటి చీర, సారె తీసుకెళ్తున్న భక్తులు

నంద్యాల కల్చరల్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): జగజ్జననీ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడమాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించుకుంటారు. గురువారం ఆషాడమాసం సందర్భంగా మొదటిరోజు జగజ్జననీ అమ్మవారికి ఆళ్లగడ్డ, నంద్యాల, గిద్దలూరు, శివ మొగ్గ, హైదరాబాద్‌, కర్నూలు, డోన్‌, కడప నుంచి వందలాది మంది మహిళా భక్తులు అమ్మవారికి పుట్టింటి చీర సారె తీసుకొని వచ్చి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని అలంకరించి భక్తులు పట్టుచీర, సారె తీసుకొని నంద్యాల బాలకొండహాలు నుంచి ఆత్మకూరు బస్టాండు మీదుగా అమ్మవారి వేషధారణలతో భక్తులు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా భక్తి పాటలు పాడుతూ జగజ్జననీ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర, సారె సమర్పించారు. దుర్గా ఫ్రెండ్స్‌ యూనిట్‌ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది మహిళా భక్తులు పాల్గొన్నారు.

గోరింటాకు వేడుక

ఆషాడమాసం సందర్భంగా రమాసమేతసత్యనారాయణ స్వామి దేవాలయంలో మెదటిరోజు గురువారం గౌరీదేవి అమ్మవారికి గోరింటాకు వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీదేవి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:46 AM