రాష్ట్రంలో ప్రజారంజక పాలన
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:59 AM
రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోందని, ఈ ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల రూరల్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోందని, ఈ ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. పట్టణంలోని 24వ వార్డు సాయిబాబానగర్‌లో బుధవారం టీడీపీ ఇన్‌చార్జి సాయిరాంరాయల్, జ్యోతిరాయల్ ఆధ్వర్యంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేదరికానికి ముగింపు ఇచ్చేలా మద్దుతు ధరలు, పంటల భీమా, ఉచితబోర్లు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ వంటి సేవలను ప్రభుత్వం అందించిందన్నారు. అలాగే తల్లికి వందనం, పాఠశాలల ఆదునీకరణ, మహిళల ఆర్దికాభివృద్ధికి డ్వాక్రాసంఘాల బలోపేతం చేయడంలో విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. మార్కుట్ యార్డు చైర్మన్ హరిబాబు, క్లస్టర్ ఇన్‌చార్జి శివశంకర్, విజయగౌరి తదితరులు పాల్గొన్నారు.
గోస్పాడు: పసురపాడు గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి, పసురపాడు, శ్రీరామ్‌నగర్ గ్రామాల బూత్ ఇన్‌చార్జిలు ఈరా భాస్కర్, మన్నెం పేరయ్య చౌదరి, గ్రామ టీడీపీ ఉపాధ్యక్షుడు జాన్‌ఖాన్ ఆధ్వర్యంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
నందికొట్కూరు రూరల్: రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు చేస్తాం.. రోడ్లపై రౌడీలను వేసుకుని ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తామంటే చూస్తూ సహించేది లేదని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. మండలంలోని దామగట్ల గ్రామంలో బుధవారం ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం ఎంపీ బైరెడ్డి శబరి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారభించారు. వారు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంచుతూ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమాన్ని వివరిస్తూ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమను స్థాపించక పోగా వచ్చిన పరిశ్రమలను కూడా వెళ్లగొట్టారని మండిపడ్డారు. నంది కొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకరెడ్డి, కాకరవాడ చిన్న వెంకట స్వామి, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, పోతుల రఘురామిరెడ్డి, కౌన్సిలర్ చాంద్‌బాషా, మురళీరెడ్డి, శైలజ, శేషన్న కార్యకర్తలు పాల్గొన్నారు.
పాణ్యం: ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 70 శాతం పూర్తి చేశామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. బుధవారుం పాణ్యంలోని ఇందిరానగర్‌లో సుపరిపాలనలో తొలిఅడుగు కర్యక్రమంలో భాగంగా చెంచుల కుటుంబాలతో కలిసి కూటమి ప్రభుత్వంపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన హామీలలో మెగా డీఎస్సీ, ఉచిత గ్యాస్, పించన్ పెంపు తదితర హామీలు నెరవేర్చామన్నారు. వర్షంలోనూ ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ చెంచుల స్థితిగతులుతెలుసుకోవడంపై చెంచులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ మండల కన్వీనర్ జయరామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ గీత, ఎంపీటీసీ రంగరమేష్, సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఏఎస్‌ఐ రఫీక్, యార్డు డైరెక్టర్లు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తపల్లి: వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. మండలంలోని గువ్వలకుంట్ల, వీరాపురం గ్రామాల్లో బుధవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆయా శాఖలకు చెందిన మండల అధికారులు, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీపీ సుంకన్న నేటికి పూరి గుడిసెలోనే కాలం వెల్లదీస్తున్న దీనస్థితిని చూసి చలించిపోయారు. తక్షణమే ఇల్లు, పింఛన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గువ్వలకుంట్ల, పాతమాడుగుల, వీరాపురం గ్రామాలకు చెందిన లబ్దిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తున్నా ఎమ్మెల్యే వర్షంలోనే ఇంటింటికి వెళ్లి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. నాయకులు సురేంద్రనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, నారపురెడ్డి, లింగస్వామి గౌడు, చంద్రశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, సహదేవుడు, జానకి రాముడు, పోత నారాయణ, రామకృష్ణారెడ్డి, వీరాపురం రామిరెడ్డి, శివారెడ్డి, సీలం లింగన్న, నాగేశ్వరరావు యాదవ్, సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, సరస్వతమ్మ, స్వామిరెడ్డి, మశమ్మ, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ఆత్మకూరు మండలంలోని ఇందిరేశ్వరం గ్రామంలో చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం ఎమ్మెల్యేయ బుడ్డా ఇంటింటికి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ప్రజలకు అందిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైల నియోజకవర్గంలో ఏడాదిలోనే రూ.150కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇంతలా అభివృద్ధి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే శిల్పా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ ఆయన చేసిన అభివృద్ధి చర్యకు రావాలని సవాల్ విసిరారు. అంతకుముందు ఎమ్మెల్యే బుడ్డాకు టీడీపీ శ్రేణులు గ్రామంలో గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తిరుపమయ్య, టీడీపీ మండల అధ్యక్షులు రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నబిరసూల్, శ్రీనివాసులు, స్వామిరెడ్డి, జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు తదితరులు ఉన్నారు.
బండిఆత్మకూరు: మండలంలోని నారాయణపురం, పార్నపల్లె, బండిఆత్మకూరు, పరమటూరు, వెంగళరెడ్డిపేట గ్రామాల్లో ‘సుపరిపాల నలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో నాయకులు రామచంద్రుడు, ఆంబ్రోస్, సాయాబాబారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శేఖర్, జాకీర్, మధురెడ్డి, లక్ష్మిరెడ్డి, శీను, శివయ్య, రామకృష్ణ, మురళిరెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.
మహానంది: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కెసీ కెనాల్ ప్రాజెక్ట్ చైర్మన్ బన్నూరి రామలింగారెడ్డి అన్నారు.అబ్బీపురం గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానంది, మసీదుపురం గ్రామాల్లో టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి చంద్రమౌళీశ్వరరెడ్డి పాల్గొన్నారు. మహానంది మండల కన్వీనర్ కంచర్ల శివయ్య చౌదరి, టీడీపీ నాయకులు బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి, పాణ్యం ప్రసాదరావు, దస్తగిరి, నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 12:59 AM