సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Jun 26 , 2025 | 01:10 AM
మున్సిపాలిటీల్లో పని చేసే కార్మికులకు రూ.26వేలు జీతం ఇవ్వాలని, అలాగే వివిధ సమస్య లను పరిష్కరించాలని ఏపీ మున్సిపాలిటీ ఇంజనీర్ వర్కర్స్ యూని యన్ సభ్యులు రామాంజినేయులు, దుర్గన్న కోరారు.
నంద్యాల టౌన్ జూన్ 25(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో పని చేసే కార్మికులకు రూ.26వేలు జీతం ఇవ్వాలని, అలాగే వివిధ సమస్య లను పరిష్కరించాలని ఏపీ మున్సిపాలిటీ ఇంజనీర్ వర్కర్స్ యూని యన్ సభ్యులు రామాంజినేయులు, దుర్గన్న కోరారు. పట్టణంలోని మున్సి పాలిటీ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ కార్మికులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. ఉద్యోగ విర మణ సమయంలో బెనిఫిట్స్ ఇవ్వాలని, గ్రాడ్యువిటీ రూ.7 లక్షలు ఇవ్వా లని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. గౌస్, భాస్కరాచారి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 01:10 AM