శ్రీశైలంలో వైభవంగా ఊంజల్ సేవ
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:59 PM
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లకు ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు.
నంద్యాల ఎడ్యుకేషన్(శ్రీశైలం), జూన్ 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లకు ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ఊయలలో ఉంచి పుష్పాలంకరణ చేసి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ఊంజల సేవ నిర్వహించారు.
అంకాళమ్మకు విశేష పూజలు
శ్రీశైలం క్షేత్ర గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణార్థం సర్కారీ సేవలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమో దకం, గంఽధోదకం, పుష్పోదకం తదితర విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు.
అలరించిన భక్తి గీతాలు
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో దేవదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో ధర్మపథం కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ మాడవీఽధిలో నిత్యకళారాధన వేదిక వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి వనపర్తి సత్యం బృందం ఆధ్వర్యంలో భక్తిగీతాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
Updated Date - Jun 27 , 2025 | 11:59 PM