ప్రజల గుండెల్లో ఎన్టీఆర్
ABN, Publish Date - May 29 , 2025 | 12:29 AM
తెలుగుజాతి గర్వించే మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారని డీఎస్పీ రామాంజి నాయక్, మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్ అన్నారు.
ఆత్మకూరు, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి గర్వించే మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారని డీఎస్పీ రామాంజి నాయక్, మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్ అన్నారు. పట్టణంలోని గౌడ్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అదేవిధంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆత్మకూరు సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నారాయణ రెడ్డి, నాయకులు శివప్రసాద్‌రెడ్డి, కృష్ణయ్య, గిరిరాజు, బాషా, మల్లికార్జునరెడ్డి, నబీరసూల్, గౌస్‌లాజం, మోతుల్లా, రామ్మూర్తి, ఎలీషా, దినకర్, శంకరశర్మ, వీరారెడ్డి తదితరులు ఉన్నారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి తహసీల్దార్ రత్నరాధిక పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డిప్యూటీ తహసీల్దార్ మనోహర్, వీఆర్వోలు ఉన్నారు.
సున్నిపెంట(ఆత్మకూరు): శ్రీశైలం మండలంలోని సున్నిపెంట గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వెస్ట్రన్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేళ్ల సురేష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు ఉమామహేశ్వరరావు, రమణ, మల్లేష్, రమణ, సుబ్బరావు, గుండయ్య, శ్రీను, రమణ, చిన్నబాబు, రాజు, అంజి, యల్లస్వామి, ముంతాజ్, జానబి, పోలమ్మ, బుజ్జి, దుర్గ, శారదమ్మ తదితరులు ఉన్నారు.
బండిఆత్మకూరు: బండిఆత్మకూరులో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు సురేష్‌రెడ్డి, తెలుగుగంగ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ మనోహర్‌చౌదరి, జాకీర్, చలమయ్య, సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి, నాగేంద్రారెడ్డి, సాయిబాబారెడ్డి, బాబు, సద్దాం, వెంకటరామయ్య, లక్ష్మీదేవి, లక్ష్మీరెడ్డి, కరీం పాల్గొన్నారు.
మహానంది: మహానంది సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరా భిషేకం చేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు కంచెర్ల శివశంకర్ చౌదరి భారీ గజమాలను వేశారు. ఎంపీపీ యశస్వీని, టీడీపీ నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి, నాగపుల్లయ్య, జనార్దన్‌రెడి,్డ రవి నాథరావు, మహేశ్వరరెడ్డి, క్రాంతికుమార్ యాదవ్, వెంకటేశ్వర్లు, కేశవరావు, శివ, మల్లికార్జునరావు, గోపవరం నీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, అస్లాంబాషా, ఉమాదేవి, బీకే సరోజమ్మ పాల్గొన్నారు.
వెలుగోడు: వెలుగోడులోని జలాశయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. టీడీపీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. టీడీపీ నాయకులు అబ్దుల్‌కలాం, మోమిన్ రసూల్, జాకీర్ హుస్సేన్, మాజీ ఎంపీపీ కృష్ణుడు, రామనాయుడు, భూపాల్‌చౌదరి, హిదాయత్, రఘుస్వామిరెడ్డి, సూరి, సయ్యద్, రాము, సంజీవుడు పాల్గొన్నారు.
నందికొట్కూరు: నందికొట్కూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 24వ వార్డు కౌన్సిలర్ చాంద్‌బాషా, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ రసూల్, కృష్ణ యాదవ్, గోకారి, సత్యనారాయణ, సలాం, పెద్ద శాలిమియా తదితరులు పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: ఎంపీడీవో కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంపీడీవో గోపీకృష్ణ, తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్, డీటీ నాగన్న, కార్యాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు.
పాములపాడు: పాములపాడులో ఎన్టీఆర్ జయంతిని టీడీపీ నాయకులు గోవిందు, స్వాములు ఏసేపు, అలీబాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు కరీంబాషా, కార్యకర్తలు పాల్గొన్నారు.
పగిడ్యాల: పగిడ్యాలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో సుమిత్రమ్మ, ఈవోఆర్డీ నాగేంద్రమయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
పాణ్యం: పాణ్యంలోని షాదీఖానాలో టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శి ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతిని నిర్వహిం చారు. అడ్వకేట్ విజయకుమార్, నాయకులు సుబ్బయ్య, మాధవి, మహేశ్, కృష్ణ నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలల్లో ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు. తహసీల్దారు నరేంద్రనాథ్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీటీ శివశంకర్ రెడ్డి, ఆర్‌ఐ రాము, సర్వేయరు నాగరాజు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం లో సిబ్బంది ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గడివేముల: మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు సత్య నారాయణరెడ్డి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. తహసీల్దార్ కార్యా లయంలో తహసీల్దార్ వెంకటరమణ, మండల పరిషత్ కార్యాల యంలో ఎంపీడీవో వాసుదేవ గుప్తా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.
Updated Date - May 30 , 2025 | 03:10 PM