విధుల్లో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:03 AM
విధుల్లో అలసత్వం వద్దని ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిడుతూరు, జూన్ 27(ఆంధ్రజ్యోతి): విధుల్లో అలసత్వం వద్దని ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శాఖలవారిగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ నారపల్లె చెరువు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు శివరామి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సర్వోత్తమ రెడ్డి, జయరాముడు, రామస్వామి రెడ్డి, నాగేంద్ర, షబ్బు బాషా, నరసింహ గౌడు, రమణరెడ్డి, సోఫి సాహేబ్, అధికారులు పాల్గొన్నారు.
మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకం త్వరలో వస్తుందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. కాతా వారి నివాసం వద్ద టీడీపీ విస్తృతస్థాయి సమావేశం టీడీపీ మండల ఎన్నికల అబ్జర్వర్ నాగముని, టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
పాములపాడు: సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు. పాములపాడులో క్లస్టర్, బూత్ ఇన్‌చార్జిలు, కో కన్వీనర్‌లు, టీడీపీ నాయకులతో విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అబ్జర్వర్ షాబుద్దీన్, మండల కన్వీనర్ రవీంద్రరెడ్డి, తిమ్మారెడ్డి, హరినాథరెడ్డి, గోవింద్, వేణు, చంద్రశేఖర్, కృష్ణ, ఆదిరెడ్డి, కరీంబాషా, వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి, మోహన్‌గౌడ్, నాగలక్ష్మిరెడ్డి, లింగస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు. కొత్తపల్లిలోని రాజరాజేశ్వరి పాఠశాల లో టీడీపీ మండల కన్వీనర్ నారపురెడ్డి అధ్యక్షతన మండల బూత్ యూనిట్ క్లస్టర్ క్లస్టర్లు, గ్రామ స్థాయి బూత్ ఇన్‌చార్జిలు, మండల కో కన్వీనర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సర్పంచ్ చంద్రశేఖర్‌యాదవ్, నాయకులు లింగస్వామిగౌడు, చంద్రశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, వెంకటరెడ్డి, వెంకటస్వామిరెడ్డి, శివారెడ్డి, నాగేశ్వరరావు యాదవ్, పాండురంగారెడ్డి, స్వామిరెడ్డి, జహరుల్లా, మోహన్, అమర్, శేఖర్, రహీంఖాన్, మన్సూర్, లింగన్న, రామిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:03 AM