ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీఎస్సీ అభ్యర్థులకు మోడల్‌ పరీక్ష

ABN, Publish Date - Jun 02 , 2025 | 01:13 AM

నంద్యాల జిల్లాలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం నాలు పట్టణాల్లో డీఎస్సీ మోడల్‌ పరీక్ష నిర్వహించారు.

నంద్యాలలో ప్రశ్నాపత్రాలను ఆవిష్కరిస్తున్న పీఆర్‌టీయూ నాయకులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం నాలు పట్టణాల్లో డీఎస్సీ మోడల్‌ పరీక్ష నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు బనగానపల్లె పట్టణాల్లో నిర్వహించిన మోడల్‌ పరీక్షలో 1500 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. నంద్యాలలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామపక్కీ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్‌ టెస్ట్‌ ప్రశ్నాపత్రాలను డీవైఈవో శంకర్‌ప్రసాద్‌ ఆవిష్కరించారు. ఆళ్లగడ్డలో జిల్లా గౌరవాధ్య క్షుడు భార్గవరామయ్య, ఎస్‌ఎం బాషా ఆధ్వర్యంలో, ఆత్మకూరు పట్ట ణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చాంద్‌బాషా ఆధ్వర్యంలో, బనగాన పల్లెలో రాష్ట్ర నాయకుడుు రామపుల్లారెడ్డి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు.

ఆత్మకూరు: డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులు ఒత్తిళ్లను అధిగమించి పోటీ పరీక్షల్లో రాణించాలని పీఆర్‌ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్‌ ఇబ్రహీం, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ చాంద్‌బాషా సూచించారు. పట్టణంలోని శ్రీపద్మావతి హైస్కూల్‌లో ఆదివారం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో విషయ నిపుణులు వెంకటేశ్వర్లు నేతృత్వంలో డీఎస్సీ మోడల్‌ టెస్ట్‌ నిర్వహించారు. స్నేహ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఆశా, పీఆర్‌టీయూ నాయకులు నూర్‌మహ్మద్‌, హుస్సేన్‌ సాహెబ్‌, దామరేకుల రవి, ప్రదీప్‌ కుమార్‌, సయ్యద్‌ మోయిద్దీన్‌, సాంబశివుడు, ముర్తుజా, షఫీవుల్లా, ఆరీఫ్‌, మోమిన్‌ వలి తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 01:13 AM