శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు: ఎస్పీ
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:47 AM
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
నంద్యాల క్రైం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. గురువారం రాత్రి ఆయన స్వయంగా విజిబుల్ పోలీసింగ్‌లో పోలీసులను పనితీరును ఆకస్మికంగా పరిశీలించారు. రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందితో ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషిచేయాలని సూచించడంతోపాటు చెకింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాత్రి గస్తీలోని సిబ్బంది వారి స్టేషన్ పరిధిలో నేరచరిత్ర గలవారిపై, అనుమానితుల కదలికలపై నిఘా వేయాలన్నారు. నంద్యాలను సేఫ్ సిటీగా చేయడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ పనిచేయాల న్నారు. పోలీస్ అధికారులు స్టేషన్ పరిధిలోని నేరచరిత్ర గలవారు, అనుమానితుల వివరాలు, వారి అడ్రస్, ఫోన్ నంబర్లతో సహా బీట్‌బుక్‌లో పొందుపరచాలని ఆదేశించారు. ప్రజలకోసం పోలీసులున్నారన్న భద్రతా భావాన్ని వారిలో పెంపొందించేందుకు కృషిచేయాలన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:47 AM