భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం: ఎంపీ
ABN, Publish Date - May 23 , 2025 | 12:25 AM
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు.
నంద్యాల కల్చరల్, మే 22(ఆంధ్రజ్యోతి): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. నంద్యాలలో విశ్వహిందూ పరిషత్-బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీర హనుమాన్ శోభాయాత్రకు ఆమె ముఖ్య అతిథిగా హాజర య్యారు. గురు వారం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డులో సభ ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణంలో వీరహనుమాన్ శోభాయాత్ర గురించి, పహల్గామ్ దాడి గురించి, వక్తలు ప్రసంగించారు. హిందువులంతా మేల్కొనాలని, ఏకం కావాలని వక్తలు ప్రసంగించారు. అనంతరం ఈ శోభాయాత్ర నిర్వహించారు. వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, వైఎన్ రెడ్డి, బజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి కిషోర్, సహకార్యదర్శి నాగరాజు, నగర అధ్యక్షులు వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్, డాక్టర్ రామకృష్ణారెడ్డి, చిలుకూరి శ్రీనివాస్, టీడీపీ నాయకలు తులసిరెడ్డి, రామచంద్రారావు, ఖండేశ్యామ్‌సుందర్‌లాల్, బింగుమళ్ల శ్యామ్‌సుందర్ గుప్తా, అడ్డగాళ్ల మల్లికార్జున, బీజేపీ నాయకులు మేడా మురళీధర్, చింతలపల్లె వాసు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:25 AM