కన్నల పండువగా నారసింహుడి కల్యాణం
ABN, Publish Date - May 12 , 2025 | 12:07 AM
నంద్యాల తెలుగుపేటలో వెలసిన ఘణమద్దిలేటి లక్ష్మీ నృసింహాస్వామి ఆలయ సప్తవిశంతి(27) వ వార్షిక వేడుకలు శనివారంనుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు.
నంద్యాల కల్చరల్, మే 11(ఆంధ్రజ్యోతి): నంద్యాల తెలుగుపేటలో వెలసిన ఘణమద్దిలేటి లక్ష్మీ నృసింహాస్వామి ఆలయ సప్తవిశంతి(27) వ వార్షిక వేడుకలు శనివారంనుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్వహకులు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో ఆదివారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం , నరసింహ జయంతి పురస్కరించుకొని ఆలయంలో ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మద్దులేటి లక్ష్మీ నృసింహా స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణాన్ని త్రిదండి చిన్న జీయర్‌స్వామి శిష్యులు అందలం నరసింహచార్యులు అర్చకత్వంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీరామమూర్తి, భక్తులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: లక్ష్మీ సమేత నరసింహ స్వామి క్షేత్రంలో స్వామి జయంతి వేడుకలు అశేష జనవాహిని నడుమ వైభవంగా జరిగింది. ఆదివారం స్వాతి నక్షత్ర ముహూర్తాన్ని పురస్కరించుకుని స్వామివారి జయంతి వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లకు లోకకల్యాణార్థం పంచామృతాభిషేకం గావించి పంచసూక్తాలను, కుంకుమార్చనలు చేపట్టారు. ప్రత్యేక అలం కరణ గావించి విశేష పూజలను నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల తరుపున దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొని తంతును పూర్తిచేశారు. నల్లకాల్వ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉత్సవమూర్తులకు పల్లకీసేవ, ఊంజల సేవ నిర్వహిం చారు. భక్తులకు దేవస్థానం తరుపున అన్నవితరణ చేపట్టారు.
Updated Date - May 12 , 2025 | 12:07 AM