పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం: ఎమ్మెల్యే
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:58 AM
పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
జూపాడుబంగ్లా, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. జూపాడుబంగ్లాలోని వేంకటేశ్వరాలయం ఆవరణలో బుధవారం మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.ముందు నుంచి టీడీపీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి గిరీశ్వరరెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో వేరే పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వారికి అందలం ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగుకుండా పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నారని, కార్యకర్తల సమావేశం తమ సమస్యలు చెప్పుకుంటే పార్టీ దృష్టికి తీసుకెళుతామని అన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘దళితులందరికీ సమానంగా రిజర్వేషన్లు’
దళితులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రిజర్వేషన్లు మూడు విభాగాలుగా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. జూపాడుబంగ్లాలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం జరిగే డీఎస్సీతో పాటు, విద్యా, ఉపాధి అవకాశాల్లో కూడా ఆప్రకారం రిజర్వేషన్లు కల్పించడం దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:58 AM