ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతారు?

ABN, Publish Date - May 09 , 2025 | 01:26 AM

ఒకే పార్టీకి చెందిన వారై ఉండి మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతారని ఎమ్మెల్యే వర్గాన్ని టీడీపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

నందికొట్కూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): ఒకే పార్టీకి చెందిన వారై ఉండి మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతారని ఎమ్మెల్యే వర్గాన్ని టీడీపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం అవిశ్వాస తీర్మాన సభ ముగిసిన తర్వాత నందికొట్కూరు లోని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నివాసంలో చైర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డి కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతా ఒకే పార్టీ అనుకున్నామని, కానీ చైర్మన్‌పై కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. దీని వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ఎంపీ డా.బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో చేసిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులు వచ్చాయని వాటిని ఇవ్వకుండా వారి ఇంట్లో దాచిపెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో అవినీతి జరుగుతుందని, వాటిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచు కోలేరని ఆయన అన్నారు. సివిల్‌ సప్లై రాష్ట్ర డైరెక్టర్‌ మహేష్‌నాయుడు, మున్సిపల్‌ చైౖర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డి, డా.కాకరవాడ చిన్న వెంకటస్వామి, కౌన్సిలర్‌ చాంద్‌బాషా, నాగేశ్వరరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 01:26 AM